( నేస్తం గారు క్రికెట్ విషయంలొ నావి కుడా అచ్చం మీ అనుభవాలె. మీ పొస్ట్ కి కామెంటు రాద్దామని అనుకుంటె అవే ఒక పెద్ద పొస్ట్ అయెటట్లు అనిపించింది and మీ బ్లాగ్ చాలా స్లో వుండింది. ఈలా వ్రాసినందుకు ఏమి అనుకొరనుకుంటు)
ఆలా ఆ బార్య భర్తలిద్దరి జీవితం మూడు సిక్స్లు ఆరు అలకలు గా సాగుతూ వుంటుంది. ఆయన గారి క్రికెట్ పిచ్చి (ఆట) ఇంకా ఎక్కువ అవుతుంది ఆ అమ్మాయి ఓపిక నశిస్తుంది. పాపం అంత ముచ్చటైన జంట ఎక్కడ విడాకుల వరకు వెలతారొ అని దెవుడు దయ తలచి ఒక శుభ ముహుర్తంలొ అతనికి వెరె వూరిలొ ఊద్యొగం వేస్తాడు. ఆ అమ్మాయి సంతొషానికి అంతుండదు.
కాల చక్రం అలా గిర్రున తిరుగుతుంది ఆ అమ్మాయి కూడా ఊద్యొగం లొ చెరుతుంది. కొత్త ఊరు, కొత్త ఊద్యొగం, కొత్త పని, కొత్త రొజులు, రొజులు చాలా ఆనందంగా గడుస్తూంటావి . ఆ అమ్మాయి office లొ చాలా మంది జనాలు భారతీయులే అందులొను చాలా ఎక్కువ మంది మగవాళ్ళె.ఈ అమ్మాయికి కొంచెం బెరుకు వాళ్లతొ మాట్లడడానికి కాని తను ఒక్క 15 నిమిషాలు కుడా నోరు ముసుకొని వుండలేదుగా అందుకె అలా అలా office జనంతొ పరిచయాలు పెంచుకుంది. అందరు చాలా మంచి ఫ్రైండ్స్ అయ్యారు . తను ఇంటి నుండి వండి తెచ్చె స్వీట్లు, టిఫ్ఫిన్లు తింటు తను చెప్పె సొల్లు వింటు. ఈలా రొజులు దొరలిపొతువుంటె పాపం ఆ అమ్మయికి తెలీకుండ అనుకొకుండా ఒక రొజు ఏ దుర్ముహుర్తంలొ లేచిందొ, పోద్దున్నె ఎవరి మొకం చూసిందొ office లొ colleagues తొ మాటల్లొ తన భర్త క్రికెట్ పిచ్చి గురించి నోరు జారింది అంతె ఆ పిల్ల కి అప్పుడు తేలీదు ఆ రొజె తన ప్రశాంత జివితానికి అఖరి రొజని.
అవి March నెలాకరి రోజులు, office లొ ఓక్కొక్కరె వాళ్ళ పని విషయాలు అన్ని తనకు చెప్తున్నారు, unix job లు ఎలా రున్ చెస్తారు, beeper వస్తె ఎమి చెస్తారు, Production Down ఐతె ఏ server లు చెక్ చెస్తారు ఇలా తను ఎన్నో రొజులునుంచి తెలుసుకుందామన్నా అసలు చాన్స్ ఇవ్వకుండా మాట మార్చె జనాలు తనకు అవన్ని ఎందుకు చెప్తున్నరొ అర్దం కాలెదు.
April మొదలైంది office లొ 5 అయంది అంటె ఒక్క దేశి మొకం కనపడట్లెదు. ఎంత important work ఉన్నా రేపు చుడొచ్చు అని అంటున్నారు. రొజంతా కుడా తనతొ ఎప్పటికంటె చాలా బాగా వుంటున్నారు ఏ హెల్ప్ అడిగిన క్షణాల్లొ చెస్తున్నారు. ఇక ఇంట్లొ భర్తలొ ఎంతో ఉత్సాహం, రోజు office నుంచి లేటె గా రావడం ఎందుకంటె project deadline కొన్ని రొజులవరకింతె శనివారాలు కూడ office కి వేళ్ళాల్సి వస్తుంది అని చేప్పడం. ఈ ఆమ్మాయికి ఏదొ డౌట్. ఒక శుక్రవారం సాయంత్రం ఆ డౌట్ క్లియర్ అయ్యింది office లొ colleague వచ్చి రేపు మీరు Production support చెస్తారా ఏమి పెద్ద ప్రబ్లెంస్ వుండవు ఎమైనా వుంటె మాకు కాల్ చెయండి ఎలాగు రేపు మీరు ఫ్రీనె కదా మీ వారు కుడా మా టీం లొ ఆడుతున్నారుగా రెపటి maTch చాలా important దీని కోసం ఎన్నొ రొజులనుంచి office ఐన తరువాత ప్రాక్టిస్ చేస్తూన్నాము, మీ వారు అల్ రౌండెర్ అండి హొప్స్ అన్ని తన మీదె అంటు డెస్క్ మీద beeper పెట్టెసి వెలుతువుంటె ఈ అమ్మయి నోరు తెరుచుకొని కళ్ళ ముందు పేనం లొనుంచి పొయ్యి లొకి పడుతున్న ఒక రొట్టె ముక్క కళ్ళకి కనిపిస్తువుంటె పాపం ఇంటికి ఏలా వెళ్ళిందొ దెవుడికె తెలియాలి. ఈక అప్పటి నుంచి ఆ అమ్మాయి ప్రతి summer ఎప్పుడు winTer వస్తుందా అని ఎదురు చుడటమే ( అందరు దేశి లకి వ్యతిరెకంగా).
కాలచక్రం ఆగదుకదా ఈప్పుడు ఆ అమ్మాయి అమ్మ, తనకి ఒక సంవత్సరమ్నర బాబు, వాడికి ఏప్పుడు చేతిలొ ఒక బ్యాట్ ఒక బాల్ వుండాలి లేకపొతె చేతిలొ ఎది వుంటె అది బ్యాట్ బాలె.
అందుకె తను ప్రతిరోజు అనుకుంటు వుంటుంది ఈ క్రికెట్ ని ఎవరు కనిపేట్టారో కాని వాళ్ళనీ చితకొట్టి చిత్రబాణాలు వెయ్యాలి అని.
( please bear with me for the typos, I'am still in the initial stages.)
Wednesday, October 14, 2009
Subscribe to:
Comments (Atom)